Acharya Movie: విడుదలకు ముందే మెగాస్టార్ Chiranjeevi ఆచార్య సాంగ్స్ రికార్డులు

Laahe Laahe Lyrical Song: మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా విడుదల కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆచార్య సినిమా పాటలు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. 

Written by - Shankar Dukanam | Last Updated : Jun 6, 2021, 12:40 PM IST
Acharya Movie: విడుదలకు ముందే మెగాస్టార్ Chiranjeevi ఆచార్య సాంగ్స్ రికార్డులు

టాలీవుడ్ అగ్రహీరో, మెగాస్టార్ చిరంజీవి సినిమాలు రికార్డులకు మారుపేరు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొరటాల శివ దర్శకత్వంతో చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య. ఈ సినిమా (Acharya Movie) విడుదల కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆచార్య సినిమా పాటలు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ స్వరాలు సమకూర్చిన ఈ సినిమా సాంగ్స్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఆచార్య సినిమా (Acharya Movie Laahe Laahe Lyrical Song) నుంచి ఇటీవల విడులైన లాహే లాహే లిరికల్ వీడియో సాంగ్ 50 మిలియన్ల మైలురాయిని చేరుకుని మెగాస్టార్ చిరంజీవి సత్తాను మరోసారి రుజువు చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే (Pooja Hegde In Acharya) సైతం ఆచార్యలో జంటగా కనిపించి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు.

వివాహం అనంతరం టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తున్న సినిమా ఆచార్య. రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో సైతం ఆచార్య మూవీ కొంత భాగం షూటింగ్‌ జరుపుకుంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తోంది. ఇదివరకే ఆచార్యకు సంబంధించి ఆచార్య టీజర్ (Acharya teaser) మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్లు, హీరోయిన్ల లుక్ పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కరోనా కారణంగా సినిమా షూటింగ్, విడుదలలో జాప్యం జరుగుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News